పల్నాడు జిల్లా కారంపూడి మండలం : జగనన్న ఇచ్చిన సంకల్పం ప్రభుత్వం ప్రజల మధ్య వారధిలా పనిచేస్తున్న వాలంటీర్ కు పేదప్రజలకు సహాయం చేయాలన్న ఆలోచన తట్టింది. పాలవాడు రాకముందే జగన్ ప్రభుత్వంలో కోడి కుయకముందే ప్రభుత్వం వాలంటీర్ ద్వారా పెన్షన్ ను అందిస్తుంది. కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన సచివాలయం2 పరిధిలోని వాలంటీర్ లేళ్ల.హెప్సీ తన ఏరియాలో పింఛన్లు పంపిణి చేస్తుండగా పింఛన్ పొందే మహిళ ఒకరు గుంటూరు గవర్నమెంట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన హెప్సీ గుంటూరు చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిన్నెల్లి. ఈశ్వరమ్మ అనే ఆమెకు వృద్ధాప్యం పింఛన్ పొందుతున్న మహిళకు ఆసుపత్రి కి వెళ్లి పింఛన్ పంపిణి చేయటం జరిగింది. ప్రస్తుత సమాజంలో ఎవరు ఎలా ఉన్న మనకు ఎందుకులే అనుకునే ఈ రోజుల్లో మహిళ కష్టాన్ని గుర్తించి ప్రతినెల రూ.2,750 చొప్పున వాలంటీర్లు లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకే అందిస్తున్నారు. అయితే వాలంటీర్ ఒక ఆడపిల్లగా తల్లిదండ్రులు అంత దూరం పంపించడం ఇష్టం లేకపోయినా ఎవరు ఇబ్బంది పడకుండా సూదూర ప్రాంతం వెళ్లి పింఛన్ అందించటం అభినందనీయం వాలంటీర్ హెప్సి ను ఎంపిడిఓ జి.శ్రీనివాసరెడ్డి, పంచాయతీ సెక్రటరీ కాసిన్యా నాయక్, గ్రామ సర్పంచ్, సచివాలయం కన్వీనర్లు మరియు పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, ప్రజలు అభినందిస్తున్నారు.