తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపకం కూడా పూర్తయింది. అక్కడక్కడా కొంతమందికి ఓటర్ స్లిప్పులు అందకపోవచ్చు. అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ స్మార్ట్ ఫోన్ తోనో లేక కంప్యూటర్ తోనో ఓటర్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఓటర్ స్లిప్ కోసం https://electoralsearch.eci.gov.in/ లింక్ ను క్లిక్ చేయండి. ఇందులో మూడు ఆప్షన్లు ఉంటాయి. ఓటరు ఐడీ, రాష్ట్రం వివరాలు నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయగానే మీ ఓటర్ వివరాలు స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. ఇందులో మీ పేరు, ఓటర్ ఐడీ వివరాలతో పాటు మీ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ బూత్ వివరాలు ఉంటాయి. ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్ తో పాటు బూత్ నెంబర్, పోలింగ్ బూత్ చిరునామా ఉంటుంది. దీంతో పాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా ఓటర్ స్లిప్ వివరాలు తెలుసుకోవచ్చు. గూగుల్ యాప్ లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో ఎలక్టోరల్ రోల్ సెర్చ్ ఆప్షన్ ద్వారా ఓటర్ స్లిప్ పొందొచ్చు.
ఇందులో క్యూఆర్ కోడ్ స్కాన్ ఆప్షన్ కూడా ఉంది. అంటే.. ఈ యాప్ లోని స్కానర్ ద్వారా మీ ఓటర్ ఐడీని స్కాన్ చేస్తే అవసరమైన సమాచారం మొత్తం కనిపిస్తుంది. దీనిని వాట్సాప్, మెయిల్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఆపై ప్రింట్ తీసుకుని పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేసి రావొచ్చు. వీటితో పాటు 1950 నెంబర్ కు ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడీ (ECI xxxxxxxxxx) ఎంటర్ చేసి సెండ్ చేయాలి. కాసేపటికి పోలింగ్ బూత్ లో పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ వివరాలతో మెసేజ్ వస్తుంది.
మెసేజ్ ద్వారా కూడా ఓటరు సమాచారాన్ని పొందొచ్చు. దీని కోసం 1950 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు ఐడి టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయాలి. కాసేపటికి మీకు పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు లాంటి సమాచారం మొబైల్‌కి మెసేజ్ రూపంలో వస్తుంది.