అల్లూరి జిల్లా గుడెంకొత్తవీధిమండం పాడేరు శాసనసభ నియోజకవర్గం పరిధి జి. కొత్త పాలెం వాసులు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే 11 కి. మీ. నడిచి వెళ్లా ల్సిన పరిస్థితి. జి కొత్త పాలెం గ్రామానికి 25 కుటుంబలు 50మంది ఓటర్ నమోదుచేసి కొనేందుకు అర్హత ఉన్నారు.75 సంత్సరలు అవుతున్న ముగ్గురు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారు. సరైన రహదారి లేకపోవడంతో గత ఎన్నికలకి ఓటు వినియోగించుకోలేదని చెప్తున్నారు. దీనికితోడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో 11 కిలోమీటర్లు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాయకులు ఓట్లు వేయించుకుంటారు తప్ప తమ గ్రామాలకు చేసిందేమీ లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాలపై దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.