కశ్మీర్ ఫైల్స్ తరహాలో వైసీపీ భూ కబ్జాలపై త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని వెల్లడించారు.
అందులో ప్రజా ప్రతినిధులు ఎవరెవరున్నారు, కడప గ్యాంగ్ ప్రమేయం ఏమిటి, భీమిలి భూములు, పెందుర్తి భూములు… ఇలా అన్ని వివరాలతో త్వరలోనే విశాఖ ఫైల్స్ తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు. సీఎస్ నుంచి, రిటైర్డ్ సీఎస్ లు కూడా ఇందులో ఉన్నారని తెలిపారు. విశాఖలో వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు.