నెల్లూరు జిల్లా కాకుటూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.రామచంద్రా రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీ రాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు వారు చేసిన కృషిని తెలియజేస్తూ, మన నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు పొందటం మనందరి గర్వకారణంగా భావిస్తూ విద్యార్థిని విద్యార్థులకు ఆయన చేసిన సేవలను వివరించారు. అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అకుంఠిత దీక్షను మరియు పుట్టిన గడ్డ పై ఆయన కున్న దేశ భక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య విజయ ఆనంద కుమార్ బాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. ఉదయ్ శంకర్ అల్లం, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కే. సునీత, డా. విద్యా ప్రభాకర్, అధ్యాపకులు డా. ఆర్ ప్రభాకర్, డా. హనుమా రెడ్డి, అధ్యపకేతర సిబ్బంది డా. జి. సుజయ్, రామకృష్ణ, మరియు విద్యార్థినీ విద్యార్థులు వారి చిత్రపటానికి ఘన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.