రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్-5 ప్రకారం హైదరాబాద్ నగరం ఏపీ, తెలంగాణలకు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీతో ఆ గడువు ముగిసిపోనుంది.
ఈ నేపథ్యంలో, సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు మించి కొనసాగించాలనే అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే లేవనెత్తాలని పిలుపునిచ్చారు.
ఈ విషయం పై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్, జాతీయ అధ్యక్షులు వి. సుధాకర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ నేలను ఆంధ్రా పాలకులు ఆక్రమించారని, తెలంగాణ నిధులు, నీళ్లు, భూములను ఆంధ్రా పెత్తందారులు స్వాధీనపరచుకున్నారని, తెలంగాణ ప్రజలను దిగువస్థాయికి అణగదొక్కారని, తెలంగాణ భాషను వెక్కిరించారని, ఉద్యోగాలు కొల్లగొట్టారని, పదవులు ఆంధ్రావాళ్ళే అనుభవించారని, తెలంగాణను 60 ఏండ్లు ఆగం చేశారన్నారు.
వందలాది మంది తెలంగాణ యువత తమ నెత్తురు ధారపోసి ఆంధ్రా పాలకుల గుండెల్లో వణుకు పుట్టించింది. సుమారు 12 వందల మంది బలిదానం వలన తెలంగాణ ఆవిర్భవించింది. నీళ్ళు, నియామకాలు, నిధులు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో యువత కలలు కట్టుకున్న ప్రపంచంలో శూన్యుమే మిగిలిందన్నారు సుధాకర్.
ఆంధ్రా పెత్తందారుల చేతిలో నేటికీ తెలంగాణ కార్మికులు నలిగిపోతున్నారు. అడుగడుగునా అణచివేయబడుతున్నారు. నేటి కి విభజన చట్టం అమలు కాలేదని , మిడిమిడి జ్ఞానంతో రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తే ఇంతే ఉంటుందని ఎద్దేవా చేసారు. పోలీసు ఉద్యోగం చేసినంత ఈజీ కాదు రాజకీయ నాయకుడిగా ఎదగడం అని అన్నారు. మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ పై ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉంటే వచ్చే సియం తో చర్చించుకొని రాష్ట్రాన్ని బాగుచేసుకోమని సూచించారు.
https://x.com/Sudhakarpress/status/1794442720561271122
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు పొడిగించాలి: జెడి. లక్ష్మీనారాయణ