వరంగల్ : పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయుల బదిలీల్లో డీఈవో వాసంతి అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురించబడింది. అందుకు గాను డీఈవో వాసంతి ఫిర్యాదు మేరకు వార్త రాసిన విలేఖరి రాజన్న అక్రిడిటేషన్ కార్డును రద్దు చేయాలని కలెక్టర్ గోపీ ఆదేశించడమైనది. దీంతో కలెక్టర్ గోపీ నిర్ణయానికి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.