contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తాగునీటి సమస్య పై గగ్గోలు .. పట్టించుకోని అధికారులు

  • కలెక్టర్ కు చేతులు జోడించి వేడుకొంటున్న గిరిజనులు
  • మాకు మంచి నీరు సౌకర్యం కల్పించాలి… రాచకిలం ఆదివాసి గిరిజన మహిళలు
  • దేవుడు వరమిచ్చినా .. పూజారి వరం ఇవ్వలేదు
  • మోటారు,పైపులు ఇచ్చారు..   విద్యుత్ కలెక్షన్ మరిచారు
  • రూ.15 లక్షలు నిధులు ఎక్కడ??
  • నిధులు ఖర్చు చేశారు,నీళ్లు ఇవ్వలేదు!!

 

అల్లూరి జిల్లా, అనంతగిరి (ది రిపోర్టర్) : అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల పినకోట పంచాయతీ కి చెందిన కొండ శిఖర గ్రామమైన రాచకిలం గ్రామంలో 230 మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు.   2022 సంవత్సరంలో ఐటిడిఏ నిధులు నుండి రూ.7-50 లక్షలు, జలజీవన్ మిషన్ క్రింద రూ.7-50 లక్షలు నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ పైప్ లైన్లు వేసేందుకు పైపులు దేవరాపల్లి నుండి బల్లగరువు వరకు తీసుకొచ్చి దింపేసారు, అక్కడి నుండి మా గ్రామస్తులు అందరూ కలిపి నాలుగు పైపుల కట్టలను కొండలపై అతి కష్టం మీద మా గ్రామాన్ని తీసుకొచ్చామని తెలిపారు, మోటారు ఇచ్చారు దాన్ని కూడా నెత్తిమీద మోసుకుంటూ మా గ్రామానికి తీసుకొచ్చామన్నారు. మోటార్, పైపులు మా గ్రామంలోనే ఉన్నాయని, పని కొంత వరకు చేసారని. నేటికీ సంవత్సరాలు దాటి పోతున్నాయని, కరెంట్ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయకపోవడంతో సుమారు రూ.15 లక్షల నిధులు మధ్యలో ఖర్చు పెట్టి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పొలాల్లో గొయ్యిలు తీసుకొని కలుషితమైన నీటిని తాగుతున్నామని, తరచూ మా పిల్లలకు మలేరియా వంటి విష జ్వరాలు వస్తున్నాయని దాంతో మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నెలలో రెండు రోజులపాటు7 కిలోమీటర్లు డోలి మోసుకుని తీసుకెళ్లే పరిస్థితి ఉందన్నారు, అర కొర నిధులతో పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారని ఎన్నికల కోసం నాయకులు మా గ్రామానికి వస్తున్నారు ఖాళీ బిందెలు నిరసన తెలియజేస్తున్నాము కానీ మా బాధలు  పట్టించుకున్న పాపన పోలేదని వాపోయారు,ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామానికి మంచినీరు సౌకర్యాలు కల్పించండని మొన్న జరిగిన జిల్లా పరిషత్ సమావేశం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించామని,నేటికీ అధికారులు స్పందించలేదనీ తక్షణమే స్పందించి మాకు మంచి నీరు సమస్య పరిష్కారం చేయాలి కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సుకూరు దేవుడమ్మ, సుకూరు వరహాలమ్మ, తదితర మహిళలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :