- పనిచేయని విఆర్పిని తొలగించండి.
- పేరుకే పనికి వెళ్తున్నాం మాకు డబ్బులు రావట్లేదని జెడ్పిటిసి వద్ద మొరపెట్టుకున్న కూలీలు
- అధికార్ల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దు
- జెడ్పీటీసి రెగం మత్స్యలింగం
అల్లూరి జిల్లా హుకుంపేట: మండల కేంద్రంలో గల హకుంపేట పంచాయితీ లో పర్యటించిన జడ్పీటిసి, డి.చింతలవీది దాలిగుమ్మడి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించారు . అనంతరం స్వయానా కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కూలీలు చేసిన పనులకు విఆర్పి మస్టర్లు నమోదు చేయటంలేదు,గతంలో చేసినపనులకు విఆర్పి మస్టర్లు నమోదు చేయక పోవడంతో కూలీలకు రావలసిన డబ్బులు ఏకౌంట్లలో జమ కాలేదని జడ్పీటిసి దృష్టికి తీసుకువచ్చారు.అలాగే పనులు జరుగుతున్నప్పుడు విఆర్పి పోటోలు తీసి అప్లోడ్ చేయాల్సివుంది,కానీ ఆయన అందుబాటులో లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నామని తెలియజేశారు, విఆర్పి లేని కారణంగా మేటే ఆ పనులన్నీ చూస్తున్నారని కూడా తెలిపారు.వీటిపై తీవ్రంగా స్పందించిన జెడ్పీటీసీ మత్యాలింగం ఎంపిడిఓ, ఉపాధి హామీ పథకం ఎపిడీీ వారికి స్వయానా పోన్ చేసి తెలియజేశారు.సమస్యను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. సమస్య పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించేది లేదని వారు కోరారు జెడ్పిసితో పాటు స్థానిక సర్పంచ్ సమిడ పూర్ణిమ, ఉమ్మిడి జిల్లా యువజన విభాగం కార్యదర్శి నైని సత్తిబాబు,యువజన నాయకు
డు పాంగి అనిల్ పాల్గొన్నారు.