- స్టిక్కర్లను ఇంటింటికి అతికించి, వైసీపీ తీరును తప్పబట్టిన తిరుపతి జనసేన పార్టీ నాయకులు.
తిరుపతి: కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి.., రాష్ట్రాన్ని ఆధోగితి పాలు చేశారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. ఇక యువతను నిర్లక్ష్యం చేయడంతో.., వారు ఉపాధి ,ఉద్యోగ అవకాశాలు లేక రోడ్లపాలై వ్యసనాలకు బానిసలై.., తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరుని నివసిస్తూ.. శనివారం తిరుపతిలో “మాకు నమ్మకం లేదు జగన్..!” మా నమ్మకం పవన్..!! అనే విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్టిక్కర్లను ఇంటింటికి అతికించి, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అధోగతి పాలయిందని ఆరోపించారు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతుంటే.., ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. సీఎం జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏపికి శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేసారనీ వలంటీర్లచే జగనన్నే మా భవిష్యత్తు అనే స్టికర్లను గోడలకు అట్టించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే మాకు నమ్మకం లేదు జగన్..!
మా నమ్మకం పవన్..!! అని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇకనైనా సీఎం జగన్ తీరులో మార్పు రాకపోతే గుణపాఠం చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి
హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ కమిటీ నాయకులు జనసైనికులు, వీరమహిళలు కీర్తన, లక్ష్మి, చంద్ర, లావణ్య, హేమ కుమార్, కొండా రాజమోహన్, షరీఫ్, సుమన్ బాబు, మునస్వామి, వినొద్, రాజేష్ ఆచారి, సాయి దేవ్, హేమంత్, సుజిత్, సాయి, పురుషోత్తం రాయల్, ఆది కేశవులు తదితరులు పాల్గొన్నారు.