కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రం బండగల్లి లొ కన్న కూతురు అనిత ఇంటి ముందు టెంట్ వేసి వృద్ధ తల్లి తండ్రులు న్యాయ పోరాటానికి దిగారు.పిట్లం మండల కేంద్రానికి చెందిన వీరయ్య చారి,అంజవ్వ కు ఇద్దరు కుమారులు వెంకటేశం,శ్రీనివాస్, ఒక కూతురు అనిత.వెంకటేశం పెద్ద కుమారుడు అనారోగ్యం తొ మృతి చెందాడు.చిన్న కుమారుడు శ్రీనివాస్ నిజామబాద్ లొ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ నిజామబాద్ లొ ఉంటున్నాడు.అనిత కూతురుకు 20 సంవత్సరాల క్రితం బాన్సువాడ కు చెందిన తిర్మలపురం శ్రీనివాస చారి కి ఇచ్చి పెండ్లి చేశారు.కుమారుడు శ్రీనివాస్ నిజామబాద్ లొ ఉండటం తొ కూతురు అనీత వృద్ధ తల్లి తండ్రులను బరువు బాధ్యతలు చూసుకుంటానని నమ్మపలికి కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకుని 15 తులాల బంగారం,10 లక్షల నగదు కూతురు,అల్లుడు తీసుకుని ఇంటి నుండి గెంటేషరని వృద్ధ దంపతులు బోరున విల పిస్తు ఆరోపించారు.డబ్బులు ఇవ్వకుంటే ఇక్కడే ప్రాణం వదులతామని వృద్ధ దంపతులు చెప్తున్నారు.
