- కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెసు నాయకుడు మేనేని రోహిత్ రావు
కరీంనగర్ జిల్లా: తొమ్మిది ఏళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలను బిఆర్ఎస్ దగా చేసిందని బిఆర్ఎస్ దగా పాలనను ప్రజలకు తెలిసేలా దశాబ్ది దగా పేరుతో టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని స్థానిక ఇందిరా చౌక్ వద్ద నియోజకవర్గ నాయకులు రోహిత్ రావు తమ కార్యకర్తలతో అధిక సంఖ్యలో
పాల్గొని ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న సమయంలో పోలీసు వారికి రోహిత్ రావు మధ్య కొంత సేపు వాగ్వాదం నడిచింది. కార్యకర్తల నినాదాల మధ్య పోలీసు వారి పెనుగులాటల మధ్య రోహిత్ రావు కేసీఆర్ దిష్టిబొమ్మను తీసుకొని పరిగెత్తి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ పెనుగులాటలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు మాట్లాడుతూ ప్రజా ధనాన్ని వృధా చేస్తూ, తెలంగాణ వచ్చి పదేళ్లు పూర్తవకముందే, ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఏర్పడ్డ తొమ్మిదేళ్లకే బిఆర్ఎస్ పార్టీ తన రాజకీయ లబ్దికోసం దశాబ్ది ఉత్సవాలంటూ ఆర్భాటంగా పలు కార్యక్రమాలు చేపట్టి, ఈ తొమ్మిది పాలన లో తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ ఓరగబెట్టిందేమీ లేదని, స్వార్థపూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా కేసీఆర్ ప్రభుత్వం నిలిచిందని, కమిషన్ల కోసం ఎగబడుతూ స్థానిక మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ పట్టణాన్ని అతలాకుతలం చేస్తున్నారని, స్మార్ట్ సిటీ వైఫల్యాలను ఉత్తి చూపినప్పటికీ ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటని కెసిఆర్ అవినీతి పాలన తెలంగాణ ప్రజలకు అర్థమైందని మాయమాటలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసే రోజులు పోయాయని, కెసిఆర్ దగాకూరు పాలనకు చరమగీతం పాడే రోజు ఆసన్నమైందని ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, రూరల్ మరియు కొత్తపల్లి మండల నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.