- అర్ధరాత్రి వింత వింత శబ్దాలతో పిచ్చి పిచ్చి కేకలు వేస్తున్న బాలికలు”
- ఆరు విద్యార్థినీలను ఇంటికి పంపించిన యాజమాన్యం
- భయాందోళన చెందుతున్న ఇతర విద్యార్థినీలు
- కళాశాలను వదిలి వెళుతున్న ఉపాధ్యా యులు”
- అందుబాటులో ఉండని ప్రిన్సిపాల్ అసలు?
- అక్కడ ఏం జరుగుతుంది?
అల్లూరి జిల్లా, గూడెం కొత్త వీధి,ది రిపోర్టర్ న్యూస్, ప్రతినిధి: అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్త వీధి మండల కేంద్రంలోని బాలికల గురుకుల కళాశాలలో అసలు ఏం జరుగుతుంది గత మూడు నెలలుగా ఈ కళాశాలలో చదువుతున్న బాలికలపై అర్ధరాత్రి సమయంలో (దెయ్యాలు) గాలి పడడం దీంతో విద్యార్థినిలు వింత వింత శబ్దాలు చేస్తూ పిచ్చి, పిచ్చి కేకలు వేస్తుండడం ఒక విద్యార్థిని ఏకంగా వేలు కోసుకోవడం అక్కడే ఉంటున్న ఇతర విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురికావడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి అయితే ఆ గురుకుల కళాశాలలో అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఎప్పుడు లేని విధంగా ఇలా వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన ఆ ప్రిన్సిపాల్ ఎక్కడ సకాలంలో ప్రిన్సిపాల్ విధులకు హాజరు కాకపోవడం పట్ల కళాశాలలో ఇటువంటి వింత వింత సంఘటనలు జరుగుతున్న ఇవి బయట ప్రపంచానికి తెలియకుండా గాయాలు చేస్తున్న ప్రయత్నం వెనుక అసలు అక్కడ ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్ కొనసాగుతుంది వింత వింత శబ్దాలు చేస్తూ పిచ్చిపిచ్చి కేకలు వేస్తున్న ఆరుగురు విద్యార్థినిలను మాత్రం వారి ఇంటికి పంపించి గురుకుల బాలికల కళాశాల యాజమాన్యం మాత్రం చేతులు దులుపుకుంది అయినా అక్కడ చదువుతున్న విద్యార్థినీలలో ఇప్పటికీ భయాందోళనలు ఆ సంఘటనలు నెమరు వేసుకుంటే తీవ్ర ఆందోళనలు కలుగుతున్నాయి,దీంతో ఈ విషయం తెలిసి బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు. అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో నెలకొన్నాయి గూడెం కొత్త వీధి మండలంలోని బాలికల గురుకుల కళాశాలలో సుమారు 300 మంది వరకు బాలికలు మొదటి రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ లో చదువులను అభ్యసిస్తున్నారు గత మూడు నెలల నుండి ఇటువంటి దెయ్యాలు పడడం వంటి సంఘటనలు జరుగుతున్న ఈ విషయంపై సంబంధిత అధికారులకు గాని తెలియజేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, పాఠశాలలో విద్యార్థులతో ఉండాల్సిన ఉపాధ్యాయులు కూడా సాయంత్రం అయితే అక్కడ అందుబాటులో ఉండకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం జరుగుతుంది దీనితో అనుమానాలు మరింత బలపడుతున్నాయి అల్లూరి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుని అసలు ఆ గురుకుల బాలికల కళాశాలలో వసతి గృహం వద్ద అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా పాఠశాల యాజమాన్యం దాస్తుంది అన్న విషయాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ చదువుతున్న గురుకుల కళాశాల విద్యార్థులు ఈ విషయం ఎవరితోనూ చెప్పలేక ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన తికమక్క పడుతున్నారు, గురుకుల కళాశాలలో ఇతరులు ఎవరు ప్రవేశించకూడదు అంటూ అధికారులు నిబంధనలు పెట్టారు గాని అసలు కళాశాలలో ఏం జరుగుతుంది? ఏమవుతుంది? అన్న విషయంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడం వలన అక్కడ జరుగుతున్న విషయాలు బయట ప్రపంచానికి తెలియడం లేదు, ఇప్పటికైనా అధికారులు స్పందించి గూడెం కొత్త వీధి గురుకుల బాలికల కళాశాలలో అసలు ఏం జరుగుతుంది అన్న విషయంపై పూర్తిస్థాయిలో ఆరా తీసి చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అధికారులు స్పందించి సకాలంలో చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభావం అక్కడ చదువుతున్న విద్యార్థినిలపై పడి రాబోయే పరీక్షల్లో వారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
సెల్ టవర్ రేడియేషన్ వలన అలా జరుగుతుందా? కాగా గూడెం కొత్త వీధి గురుకుల బాలికల కళాశాల వద్ద బిఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన మినీ సెల్ టవర్ ను ఏర్పాటు చేశారు,అయితే ఈ షెల్టర్ బాలికల కళాశాల పై కప్పు మీద ఏర్పాటు చేయడం వలన దీని ద్వారా వచ్చే రేడియేషన్ వలన ఇలా జరుగుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు ఈ సెల్ టవర్ ఏర్పాటు చేసిన తర్వాతే ఇటువంటి సంఘటనలు జరుగుతుండడంతో దీనికి సెల్ టవర్ రేడియేషన్ ఏమన్నా కారణమా అన్న సందేహం కూడా కలుగుతుంది జిల్లా అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Status Polypropylene Anti Slip Floor Door Mat in Home Kitchen Office Entrance Mats (38×58 cm) (Beige, 15 x 23)
Deal Price : ₹99 – M.R.P.: ₹999
https://amzn.to/46oV2D8