- అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు పనులు వేగవంతం చేయించాలి: కందుల రాజేష్
అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి,(ది రిపోర్టర్) :అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం జర్రేల, మొండిగడ్డ,వంచుల పంచాయతీల గ్రామ ప్రజలకు మొండిగడ్డ బస్సు నిలిపివేయడంతో ప్రజా రవాణా కష్టాలు మొదలయ్యాయి.కొత్తపాలెం నుండి జర్రేల వరకు రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం బస్సును నిలిపివేశారు. అయితే నెలలు గడుస్తున్న రోడ్డు పనులు సాగటం లేదు. రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేయక కాలయాపన చేయటంతో మరియు బస్సు నిలిపివేయడంతో మూడు గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని మొండిగడ్డ వాలంటర్ కందుల రాజేష్ మీడియాతో అన్నారు. రోడ్డు పనులు సగం సగం చేసి ఆపేస్తున్నారు. దీంతో గ్రామస్తులు చింతపల్లి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో భారీ చార్జీలు చెల్లించి బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు.విద్యార్థులు,ఉద్యోగులు, ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్న ఈ రోడ్డులో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయటానికి భయపడుతూనే తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణం చేస్తున్నారు. కావున అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి త్వరత గతిన రోడ్డు మరమ్మత్తు పనులు పూర్తిచేసి బస్సు సౌకర్యం కల్పించాలని మూడు పంచాయతీల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.