- సింగరుట్ల శ్రీలక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం ఈవో మారినా … పేరు మార్చని వైనం
- బదిలీ పై వెళ్లిన ఈవో పేరును కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటో!
- ప్రస్తుత ఈవో ఎవరో తెలియక అయోమయంలో భక్తులు
- బోర్డు లేని దేవస్థాన కార్యాలయం
పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని పేట సన్నెగండ్ల గ్రామ శివారులో చుట్టూ కొండలు, ప్రకృతి ఆహ్లదకరమైన వాతావరణంలో స్వయంభుగా శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారు వెలిసి భక్తుల కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయ ప్రాంగణంలో గ్రామ పెద్దల సహకారంతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయాన్ని ఎండోమెంట్ శాఖా పరిధిలోకి ప్రభుత్వం తీసుకుంది.
దేవాలయానికి వచ్చిన భక్తులు దేవాలయ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మరియు దేవాలయ అభివృధికి నిధులు ఇచ్చేందుకు వచ్చిన భక్తులకు సౌకర్యంగా దేవాలయ ప్రాంగణంలో నల్ల బోర్డు ఏర్పాటు చేసి ఈ వో పేరు, ఫోన్ నెంబర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతం లో ఉన్న ఈవో బదిలీ అయి ఎనిమిది నెలలవుతుంది. కానీ నేటికీ గతంలో ఉన్న ఈవో పేరు ఫోన్ నంబర్ బోర్డు పై మారలేదు. ఇప్పటికి ఎండోమెంట్ వారు ఎవరికైనా బాధ్యతలు ఇచ్చారా లేదా ? నేటికీ భక్తులకు తెలియదు. సాధారణ బదిలీల్లో భాగంగా ఈవో లు బదిలీ అవుతుంటారు. బదిలీ అయిన ఈవో పేరు తీసివేసి భక్తుల సౌకర్యం కోసం నూతన బాధ్యతలు చేపట్టిన ఈవో పేరు, ఫోన్ నెంబర్ రాయవలసి ఉంటుంది. కాని అందుకు భిన్నంగా సుమారు 8 నెలలు క్రితం బదిలీపై వెళ్లిన ఈవో పుణ్యాల వెంకటరెడ్డి పేరును నేటికీ కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటో భక్తులకు అర్ధం కావడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా భక్తులు, స్థానికులు కోరుతున్నారు.