నిజామాబాద్ జిల్లా : మాక్లుర్ మండలం మాణిక్ బండర్ తండాలో చెందిన రాజేశ్వరి (19) మార్చ్ 23 రాత్రి గడ్డి సేవించడంతో గమనించిన తండ్రి భీమ్ నాయక్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లడంతో వైద్యులు వైద్యాన్ని అందించారు. 28 తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సను అందజేశారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేశ్వరి మృతి చెందింది. ఎస్ఐ యాదగిరి గౌడ్ వివరాల ప్రకారం ప్రేమికుడు వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. వేధించిన వ్యక్తి ని శనివారం అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
