చైతన్యపురి : సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబిత ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం మహిళ సంక్షేమ దినోత్సవంలో భాగంగా ఉమెన్ సేఫ్టీ సైబర్ క్రైమ్స్ పై రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై ఆమె మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళల రక్షణకై షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
పాఠశాలలు, కార్యాలయాలు, రోడ్డు వెంట వెళ్తున్న సమయంలో మహిళలు అప్రమతంగా ఉండాలని సూచించారు. అనంతరం వివిధ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అనంతరం హెల్ప్ లైన్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజన్ కుమార్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దయా నంద్ గుప్తా, ఎగ్గే మల్లేశం, కమిషనర్ డీఎస్ చౌహన్, సినీనటుడు బలగం ఫేమ్ ప్రియదర్శి, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ స్కూల్స్ విద్యార్థులు, యువత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.