- మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి
- YSR తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్
- అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.
నిజామాబాద్: ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పులా మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నగరంలోని చైతన్య హై స్కూల్లో మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ గారు మాట్లాడుతూ ఇప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు మహిళలను చిన్న చూపుగా చూస్తున్నాయి అన్నారు.
రాజకీయాల్లో అయిన మహిళలు చేసే ఉద్యోగ విషయంలో అయిన మహిళలు అంటే కొన్ని ప్రాంతాల్లో బానిసల చూస్తున్నారన్నారు.
మహిళకు సరైన రక్షణ లేక రోజు ఎదో ఒక చోట మహిళలపై దాడులు హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయాన్నాయి. ఇప్పట్టికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళల రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలన్నారు.
ప్రతి శాఖలో మగవారితో సమానంగా ఉద్యోగాలు ఇవ్వాలని , అన్ని హక్కులు కల్పించాలని , రాజకీయాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
ఒంటరిగా జీవనం సాగిస్తున్న మహిళలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలను డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ టీ విభాగం అధ్యక్షులు మోహన్ నాయక్ , నగర అధ్యక్షులు కస్తూరి ప్రవీణ్ , నగర ప్రధాన కార్యదర్శి ఆనంద్ , సాయిలు మహిళ విభాగం నగర అధ్యక్షురాలు బుడిగే హరిని , నగర యువజన విభాగం అధ్యక్షులు సంతోష్ , మహిళ నేతలు శశిరేఖ సీనియర్ నాయకులు సలీమ్ , పాండు తదితరులు పాల్గొన్నారు