కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : మండల కేంద్రంలోని రైతు వేదిక లో గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మహిళా సంఘాల సభ్యులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈనెల 6 తేదీన శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ లోని రామ్ లీలా మైదానంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఈ కార్యక్రమాన్ని మహిళా సోదరీమణులు విజయవంతం చేయాలని జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, న్యాత సుధాకర్,తీగల మోహన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, (ఐకెపి) ఏపీఎం లావణ్య, సర్పంచులు ఎంపీటీసీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.