పిఠాపురం : మున్సిపల్ కార్యాలయాల్లో పని చేస్తున్నటువంటి వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం నుంచి సిబ్బంది విధులు బహిష్కరించి, పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన శిబిరం ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన్ సమ్మెకు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు బోను దేవా, 16వ వార్డు కౌన్సిలర్ పెదపాటి రాజేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు రాంబాబు, చెట్టుబత్తిన సురేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నా సర్వీసులు క్రమబద్ధీకరీంచటంలేదన్నారు. బకాయి వేతనాలు చెల్లించాలని, టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెంకె రాంబాబు, మురాలశెట్టి అచ్చిరాజు, కరణం శ్రీను, కోవెల శ్రీనివాస్, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.