- జీసిసి హమాలీలకు బకాయి పడ్డ 13 నెలలు ఏరియర్స్ చెల్లించాలనీ సమ్మె
- జీ.కే.వీధిలో జీ.సి.సీ వద్ద హామాలీల ధర్నా
అల్లూరి సీతారామరాజు జిల్లా: గిరిజన కార్పొరేషన్ ద్వారా రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే హమాలీలకు 2022 సంవత్సరం జనవరి నెలలో పెరిగిన ఎగుమతి, దిగుమతికీ క్వింటా బస్తాకు 3 రూపాయలు పెంచారు. పెంచిన రేట్లు యొక్క ఎరియర్స్ బకాయిలు గత 13 నెలవి హమాలీలకు ఇవ్వకుండా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉండి హమాలీల పట్ల అత్యంత నిర్లక్ష్య భావంతో ఉంటూ ఏరియర్స్ చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. మరియు 2022 సంవత్సరం దసరా పండగ సందర్భంగా ప్రతి హమాలీకి మూడు జతలు బట్టలు ఇవ్వాలని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ జీవో విడుదల చేసింది ఈ జీవో ప్రకారం బట్టలు నేటికీ హమాలీలకు ఇవ్వలేదు.ఎన్నిసార్లు ఈ విషయంలో అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండా ఉంది.అందుకే హమాలీలంతా గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె నోటీసులు జారీ చేసి పనులు బంద్ చేయడమే మార్గం అని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా వెంటనే అధికారులు హమాలీల సమస్యలను పరిష్కరించాలని బకాయి పడ్డ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, ప్రతి హమాలికి మూడు జతలు బట్టలు ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. నేటినుండి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరియు విజయనగరం జిసిసి గోడౌన్ పరిధిలో మూడు మండలాల్లో కూడా సమ్మె హమాలీలు చేస్తున్నారు అధికారులు స్పందించి వెంటనే సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని హమాలీలకు కోర్కెలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేస్త్రి సత్తిబాబు, పెంటి చిట్టిబాబు,జైతి పండు,కాకరి కిషోర్, రాజుబాబు పాల్గొన్నారు.