తిరుపతి జిల్లా పాకాల మండలం ఎమ్మెస్ ఆఫీస్ నందు పాకాల మండల్ లెవెల్ కన్వర్జేన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజా భాగస్వామ్యం ప్రకృతి వ్యవసాయంపై వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్ నందు అధికారులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో జరిగే గ్రామం నందు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ కరెక్ట్ గా చేసుకొని గ్రామంలోని రైతులందరూ తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ముందుకు రావాలని అట్లాగే ప్రతి ఒక్కరూ తమ పొలంలో పిఎండిఎస్ 20 నుంచి 30 రకాల విత్తనాలను కలిపి భూమిలో చల్లుకొని 365రోజులు భూమి కప్పి ఉంచే విధంగా ఉండాలని తద్వారా భూమిలోని సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కలకుపోషకాలు పుష్కలంగా అంది పంటలు దిగుబడి పెరగడం జరుగుతుందన్నారు.అదేవిధంగా విషరహిత ఆహారాన్ని అందరూ తీసుకునే దానికి వీలుగా ఉంటుందని, ఇటువంటి విషరహిత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి మహిళా సంఘాల ద్వారా మహిళలు ముందుకు రావాలని మహిళ ద్వారానైతే ఈ ప్రకృతి వ్యవసాయం అనే ప్రోగ్రాం విజయవంతంగా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అన్నారు. అందువలనే ఈ కన్వర్జేన్సీ మీటింగ్ మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని కాబట్టి అందరూ ప్రకృతి వ్యవసాయం ఆచరించి ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేసి తోటి రైతులకు ఆదర్శవంతంగా ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాకాల మండల్ హెచ్ ఓ శైలజ, ఏవో పుష్పావతి మేడం, ఎం సి ఆర్ పి రాధాకృష్ణారెడ్డి, ఎంప్టీ శ్రీదేవి, ఎన్ ఎఫ్ ఏ గీతా రాణి, ఎస్ ఆర్ పి భానుమూర్తి, ఏపీఎం, ఏపీ ఓ, సీసీలు, ఐసిఆర్పీలు, వివో లీడర్సు, ఎంఎస్ లీడర్సు, సంఘమిత్రాలు మరియు ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.
