వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది.
ఈ సదస్సుకు చైనాలోని టియాంజిన్ వేదిక కానుంది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్కు డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే ఆహ్వానం పంపారు. కొత్త ప్రణాళికలు, సాంకేతికతతో తెలంగాణ దూసుకెళ్తోందని బోర్గె ప్రసంశల వర్షం కురిపించారు.