ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ఆంగ్ల విభాగం సహాయ ఆచార్యులు, ఐక్యూఏసి కోఆర్డినేటర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కవిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు..
విభిన్నంగా… వినూత్నంగా..
ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ కవితా దినోత్సవ కార్యక్రమం ఆద్యంతం విభిన్నంగా వినూత్నంగా సాగింది. ఛాయాచిత్రాల ఆధారంగా అప్పటికప్పుడు కవిత్వం రాయించిన తీరు ఆకట్టుకుంది ఆంగ్ల తెలుగు సాహిత్యాలపై నిర్వహించిన క్విజ్ కార్యక్రమం అధ్యాపకులతో పాటు విద్యార్థులను అలరించింది.
కవిత్వం రాయడం అలవర్చుకోవాలి..
విద్యార్థులు కవిత్వం రాయడాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్ ఎం గోపాల్ పిలుపునిచ్చారు. మనలో ఉన్న భావాలను వ్యక్తం చేస్తే కవిత్వం పుడుతుందని తెలిపారు. అక్షర జ్ఞానం, అనుభవాల ఆధారంగా కవిత్వం పుడుతుందని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులందరూ భావి భారత కవులుగా తయారవ్వాలని అకాడమీక్ కోఆర్డినేటర్ పి.శ్రీలత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.