కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బండి మల్లన్న యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇందిరా పార్కులో ఈ నెల ఆగస్టు 8న జరిగే యాదవ గర్జన పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది, నాలుగు ప్రధానమైన డిమాండ్లతో యాదవ గర్జన ఇంద్ర పార్క్ లో నిర్వహించడం జరుగుతుంది, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించాలని 20 శాతం ఉన్న యాదవులకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నామినేటెడ్ సీట్లను కేటాయించాలని ఎస్ ఎన్ టి రిజర్వేషన్ను పునరుద్ధరించాలని రెండో విడత గొర్రెల పంపిణీ తక్షణమే చేయాలని, ఈ నాలుగు ప్రధానమైన డిమాండ్లతో ఈనెల 8 ఆగస్టు 2023 మంగళవారం రోజున హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే యాదవ గర్జనను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా యాదవ సంఘం సభ్యులకు పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాముల్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వంశి మోహన్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి రాముల్ యాదవ్,రాష్ట్ర కార్యదర్శి గంగుల లింగం కుమార్ యాదవ్,సాయి కుమార్ యాదవ్ చంద్రశేఖర్ యాదవ్, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు పాశం తిరుపతి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా కొమురయ్య యాదవ్, శ్యాం కుమార్ యాదవ్, ముక్కెర కొమురయ్య యాదవ్, కరీంనగర్ జిల్లా యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.