హైదరాబాద్: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. విమానం దిగగానే ఆయనకు ముఖ్యమంత్రి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు.
యశ్వంత్‌సిన్హాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి జలవిహార్‌కు బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. ఆ మార్గంలో రోడ్లన్నీ గులాబీమయ్యాయి. కాసేపట్లో ర్యాలీ జలవిహార్‌కు చేరుకోనుంది.