తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని నిరసిస్తూ పెద్ద ఎత్తున చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి విద్యుత్తు కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యర్తలు ర్యాలీ వెళ్లి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్తు చార్జీలు పెంచనని ప్రజలను నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలు పెంచి ప్రజలను మోసం చేశాడన్నారు. ట్రూఅప్ చార్జీలు అంటూ పెద్ద ఎత్తున చార్జీలు పెంచి కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గం అన్నారు. విద్యుత్తు చార్జీలు తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలకు మంచి జరిగేలా నిర్ణయం తీసుకుని పెంచి చార్జీలను తగ్గించాలన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పోరుబాటకు తరలివచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా అన్నారు. కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై పోరాటానికి ప్రతి ఒక్కరు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
