మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. టీడీపీ కార్యకర్త కొమెర శివ ఫిర్యాదుతో మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఈ నెల 26వ తేదీన మాచర్ల కోర్టుకు పిన్నెల్లి హాజరయ్యారు. కోర్టుకు హాజరవుతున్న సమయంలో పిన్నెల్లికి టీడీపీ నేత కొమెర శివ ఎదురుపడ్డారు. మరుక్షణమే తన చేత్తో కొమేర శివ కడుపులో గుద్దారు పిన్నెల్లి. అకారణంగా తనను దూషించి తనపై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కొమెర శివ. శివ ఫిర్యాదుతో పాటు పిన్నెల్లి దాడి చేస్తున్న వీడియోను ఆధారం చేసుకుని సెక్షన్ 323 క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.