ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.
ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల, తన సొంత పార్టీ నేతల ఆరోపణలవల్ల, పార్టీ అధిష్టానం భిన్న వైఖరి వల్ల తాను పార్టీ వీడుతున్నానని మాజీ మంత్రి పేర్కొన్నారు .
వ్యక్తిగతంగా తనకు రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మంచి అనుబంధము ఉన్న, జగన్ మార్కు రాజకీయాలు, నిర్ణయాలతో తన పార్టీలో మరిన్ని రోజులు ఇమడ లేకపోయానని , తనను నమ్మి ఒంగోలు ప్రజలు ఐదుసార్లు శాసనసభ్యునిగా ఎన్నుకున్నారని, ప్రజా తీర్పును ఎప్పటికైనా శిరోధార్యంగా భావిస్తానని ఇప్పటివరకు విలువలతో కూడిన రాజకీయం చేశానని , పార్టీలకు అతీతంగా తనను నమ్మి వచ్చిన ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు తన రాజీనామా లేక పంపారు.