- వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ చేరికలు
వినుకొండ పట్టణంలోని ABM కాంపౌండ్, డ్రైవర్స్ కాలనీ, అరుంధతి కాలనీ, బ్రాహ్మణపల్లి, నాగిరెడ్డి పల్లి కి చెందిన 70 కుటుంబాల వారు ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి స్థానిక శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి సమక్షంలో పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూసి, మరియు వినుకొండ నియోజకవర్గ లో జరుగుతున్న సుపరిపాలనను చూసి ఆకర్షితులై, ఈ రోజు 70 కుటుంబాల వారు పార్టీ లోకి చేరటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపుతూ, పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ లో సముచిత గౌరవ మర్యాదలు ఇస్తామని తెలిపారు. అనంతరం పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుపు కు కృషి చేసి, వినుకొండ అభివృద్ది ప్రధాత అయిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారిని భారీ మెజార్టీతో మరలా ఎమ్మెల్యే గా గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణం లోని అన్ని వార్డుల కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.