- వైసీపీని వీడి టీడీపీలో చేరిక
- వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జూలకంటి
కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామ వైసీపీ నాయకులు పంగులూరి నిలా అంజయ్య, ఉన్నం హరిబాబు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు సాయంత్రం మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మనంద రెడ్డి అధ్వర్యంలో ఒప్పిచర్ల కళ్యాణ మంటపం లోని పార్టీ కండువా కప్పుకొని ఆయన సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. వారితో పాటు మరీ కొందరు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మనంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కచ్చితంగా టీడీపి ప్రభుత్వం వస్తుందని అందరూ కలసిగట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంగులూరి పుల్లయ్య, పంగులూరి అంజయ్య, కారంపూడి జనసేన పార్టీ అధ్యక్షులు కేశనపల్లి కృష్ణ బాబు మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.