పల్నాడు జిల్లా కారంపూడి : మాచర్ల నియోజకవర్గంలో రోజు రోజుకి వైసీపీకి చుక్కెదురవుతుంది. ఆ పార్టీ నేతల వైఖరి కారణంగా ఇక ఆ పార్టీలో కొనసాగలేమని భావించి ఊర్లకు ఊర్లు తెలుగుదేశం పార్టీ చెంతన చేరుతున్నారు. మూడు రోజుల్లోనే దాదాపు రెండువేల మందికి పైగా వైసీపీకి చిందిన బలమైన కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. తాజాగా మంగళవారం నాడు కారంపూడి మండలానికి చెందిన ఎస్సి మాల సామజిక వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు సుమారు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. వైసిపి నాయకులు మాలలకు తీరని అన్యాయం చేశారని, సమాధి స్థలం కూడా కబ్జా చేశారని, కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని హామీ ఇచ్చి మోసం చేసారని, భూ దందాలు, దళితుల పై దాడులు ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయని, దుర్మార్గపు పాలనను తుంగలో తొక్కాలనే వైసిపిని వీడి టిడిపిలో చేరుతున్నాని తెలిపారు. ఈ సందర్భంగా జూలకంటి వారికి తెలుగదేశం కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.