అనంతపురం జిల్లా/ మడకశిర: శుక్రవారం బాలాజీ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రొల్ల మండలం కాంచన కిరీటం పంచాయతీకి చెందిన 30 కుటుంబాలు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నీ గ్రహించి మడకశిర నియోజకవర్గం అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టిస్తున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిని ఆదర్శంగా తీసుకొని టిడిపికి ఆకర్షితులై పార్టీలో చేరారు. బ్యాడిగెర మరియు వడ్రహట్టి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు ఎక్స్ ఎంపిటిసి నరసింహప్ప, గంగాధర్, కృష్ణమూర్తి ,తిమ్మప్ప, ఈర నాగప్ప, తిమ్మరాజు, వెంకటేష్, హనుమంతి , వెంకటప్ప, దొడ్డ రామప్ప రంగస్వామి అప్ప రమేష్ శివ శంకరప్ప, పసుపు కండువా కప్పుకొన్నారు.