సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండల వీరాపూర్ గ్రామ శివారులోని మిడ్ మానేర్ కెనాల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు జారిపడి దుర్మరణం చెందారు. గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్తుల వివరాల ప్రకారం, రోహిత్24 సం: యువకుడు హైదరాబాద్ నుండి తన బంధువుల ఇంటికి వీరాపూర్ గ్రామం రావడం జరిగింది, మధ్యాహ్నం వీరాపూర్ గ్రామానికి చెందిన చిలుముల పవన్23 సం :, గాలిపెల్లి ఉదయ్ కిరణ్ 17 సం : ఇద్దరినీ తీసుకొని గ్రామ చివరన ఉన్న బహిర్భూమికి వెళ్లారు, ఇందులో హైదరాబాద్ నుండి వచ్చిన రోహిత్ కెనాల్ లో ప్రమాదవశాత్తు కాలు జారి పడడంతో అతనిని రక్షించే క్రమంలో చిలుముల పవన్ కాపాడే ప్రయత్నంలో భాగంగా కెనాల్ లో దిగడంతో, “ఈదడం” రాని రోహిత్ భయంతో చిలుముల పవన్ ను పట్టుకోవడంతో ఇద్దరు కెనాల్ లోతులోకి పడిపోయారు, వీరిద్దరిని కాపాడే ప్రయత్నంలో గట్టు పైన ఉన్న గాలి పెల్లి ఉదయ్ కిరణ్ పైనుండి తాడు వేసి రక్షించే ప్రయత్నం చేసిన దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం ఫలించక రోహిత్, చిలుముల పవన్ దుర్మరణం చెందడంతో వీరాపూర్ గ్రామ ము శోకసముద్రంలో మునిగింది. అలాగే చిలుముల పవన్ తండ్రి తన చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి చిలుముల లచ్చవ్వ కాయ కష్టం చేసుకుంటూ కొడుకును చదివించుకుంటుంది ఈ క్రమంలో ఇలా ప్రమాదంలో చేతికి అందిన కొడుకు మరణించడంతో తల్లి తీవ్రంగా రోదిస్తుందని గ్రామస్తులు కన్నీటి పర్యంతం అయ్యారు.