వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అధ్వర్యంలో ఢిల్లీ లోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి , తెలంగాణలో సిఎం కేసిఆర్ చేస్తున్న అవినీతి పాలనపై వ్యతిరేకంగా ధర్నా, పార్టీ నేతలతో కలిసి నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయని, ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పారు. అయినా షర్మిల ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆమెతోపాటు, వైయస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ధర్నాలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాశీ సతీష్ కుమార్, జిల్లా మహిల అధ్యక్షురాలు జాగటి కల్పన, సోషల్ మీడియా జిల్లా ఇంఛార్జి దాగమ్ సుధా, తదితరులు పాల్గొన్నారు