ఇచ్చాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజలక్ష్మీ అధ్యక్షతన వైస్సార్ చేయూత 4వ విడత సంబరాలు పురుషోత్తపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ మాట్లాడుతూ వైస్సార్ చేయూత నాలుగు విడత లలో మొత్తం మొత్తం 2329 మంది లబ్దిదారులకు 14,71,50,000 రూపాయలు చేయూత ద్వారా మహిళలకు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రమేష్ ,రెడ్డిక కార్పొరేషన్ ఛైర్మెన్ లోకేశ్వరావు ,టౌన్ ప్రెసిడెంట్ ప్రకాష్ పట్నాయక్ , జెసిఎస్ కన్వీనర్ సాలీనా డిల్లీ , కౌన్సిలర్ ప్రేమ్ కుమార్ చాట్ల పుష్పా ,బచ్చు జగన్ ఇతర వార్డ్ పెద్దలు పాల్గున్నారు.