కడప జిల్లా – మైదుకూరు నియోజకవర్గం: దువ్వూరు మండల కేంద్రంలో వివిస్వామి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా 3వ విడత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 881 మహిళా పొదుపు సంఘాలలో వున్న 8810 మంది లబ్ధదారులకు 6.1 కోట్ల రూపాయల చెక్కును మైదుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామి రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఇరంగం రెడ్డి తిరుపాల్ రెడ్డి, మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమన్నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్ర రెడ్డి, జడ్పీటీసీ మెర్వ కృష్ణయ్య, సచివాలయాల కన్వీనర్ శంకర్ రెడ్డి, సర్పంచ్ చెండరాయుడు, వైసీపీ నాయకులు వివి స్వామి,మండల కన్వీనర్ చిరాకి బాష, ఏపీఎం శ్రీధర్ మరియు మండల వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.
మీటింగ్ జరుగుతున్న సమయంలో ఆధికారులు మరియు ప్రజాప్రతినిధులు కుర్చిల్లో ఆసీనులు కాగ . హాజరైన పొదుపు సంఘాల మహిళలు అందరికి కుర్చీలు లేక పోవడంతో చాలా మంది మహిళలు క్రింద కూర్చున్నారు ప్రచారం కోసం వేలు ఖర్చు చేసే నాయకులు కనీసం కుర్చోడానికి తగినన్ని కుర్చీలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరం మహిళల అభ్యున్నతి కోసం పధకాలు ఇచ్చేవారు మహిళలకు ఇచ్చే కనీస గౌరవం ఇదేనా అని పలువురు అసహనం వ్యక్తంచేస్తున్నారు.