ఈ ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదు, చంద్రబాబు ఉండడని వైసీపీ ఎంపీ విజయసాయి ట్వీట్ చేశారు. హైదరాబాదులో 42 ఏళ్ల కిందట ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా పీకేసిందని, చంద్రబాబు తెలంగాణలో పూర్తిగా చాపచుట్టేశాడని పేర్కొన్నారు.
16 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీ ఇలా అదృశ్యమైపోవడం ఎవరి స్వార్థ ఫలితం? ఇప్పుడు ఏపీలో కూడా అదే పునరావృతం అవుతుందని వివరించారు. ప్రజలే తుది తీర్పును వెలువరిస్తారని, జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత చంద్రబాబు పార్టీ ఉండదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
విజనరీ, అపర చాణక్యుడు అని ఎల్లో మీడియా జాకీలు, క్రేన్లు పెట్టి లేపిన బాబు చరిత్రహీనుడిగా రాజకీయ యవనిక నుంచి నిష్క్రమిస్తాడు… ఇది యథార్థం అని పేర్కొన్నారు.