contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైసీపీ నేతలపై భౌతిక దాడులు .. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుపతి రూరల్ మండలంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మరియు చంద్రగిరి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే పులివర్తి నాని గురించి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో 34 మంది వైసీపీ నేతలపై భౌతిక దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. అర్థరాత్రుల్లో ముసుగులు వేసుకొచ్చి వైసీపీ నేతలను ఎక్కడంటే అక్కడ కొడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో అధికారం చేతిలో ఉన్నా పులివర్తి నాని పై ఐదేళ్లలో ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. పులివర్తి నాని తన క్వారీ పైన పెనాల్టీ వేసి మూత వేయించారని చెపుతున్నాడు అదంతా అబద్ధం అన్నారు. నాని తన వ్యాపారాల కోసం నాతో పాటు, అప్పటి మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా పనులు చేయించుకున్నాడన్నారు. ఐదేళ్ల జగనన్న ప్రభుత్వంలో ఒక గంట కూడా పులివర్తి నాని క్వారీ మూయలేదు, అలాగే నానికి సంబంధించిన ట్రాన్స్ పోర్ట్ నుంచి రవాణా చేసే 12 లారీలు ఒక్క రోజైనా సీజ్ చేశారా ? అన్నారు. ఐదేళ్లు నీకు గాడ్ ఫాదర్ లాగా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి నిలబడ్డారన్నారు. పులివర్తి నాని చంద్రబాబు దగ్గర నన్ను విలన్ గా చూపించి పదవులు పొందాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో నంది అవార్డులు ఇస్తే పులివర్తి నాని నటనకు మొదటగా ఇవ్వాలన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం నాని ఆడిన నాటకాలు కారణంగా ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు అందరూ అకారణంగా సస్పెండ్ అయ్యారన్నారు. ఒక వ్యక్తి నాటకంతో అంత మంది పోలీసు అధికారులు సస్పెండ్ అయితే పోలీసు అధికారుల సంఘం ఏం చేస్తున్నారన్నారు. నాని నాటకాలు ఆడుతుంటే మీ పోలీసులకు అన్యాయం జరుగుతుంటే పోలీసు అధికారుల సంఘం ప్రశ్నించ లేరా..? అన్నారు. సస్పెండ్ అయిన అధికారులు జీతాలు లేక రోడ్లు పైకి వచ్చారు, అయినా వారి గురించి మాట్లాడరా ?, గత ఎన్నికల సమయంలో చెవిరెడ్డి కొడుకు చేతిలో ఓడిపోతే నా శవం చూస్తారని, ఇంటింటికీ వెళ్లి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ పులివర్తి నాని చేశారన్నారు. ప్రతి రోజూ అవినీతి ఆరోపణలు వద్దు.. మీ ప్రభుత్వం ద్వారా విచారణ చేయించండి అన్నారు. టీడీపీ కార్యకర్తల్లారా నాని మాటలు నమ్మి పల్లెలో రాజకీయ గొడవలకు దిగితే ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఎంతో మంచిగా చూసుకున్నా.. ఇప్పుడు మీరు నాని మాటలు నమ్మి గొడవలు చేస్తే వడ్డీతో సహా చెల్లించే రోజు ఒకటి వస్తుందన్నారు. నాకు ప్రతిపక్షం కొత్తకాదు.. పోలీసు కేసులు, జైళ్లు నేను చూడనివి కావు.. నేను దేనికైనా సిద్ధం.. విద్యార్థి దశ నుంచే పోరాటం చేసే ఇంత వరకు వచ్చిన వ్యక్తిని అన్నారు. తనతో పాటు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల ఓపికను బలహీనత అనుకోవద్దు అన్నారు. ఎంత మందిని కొడతారో కొట్టండి.. వడ్డీతో సహా చెల్లిస్తాను.. ఇప్పుడు ఎవ్వరినైతే కొడతారో వారి చేతనే మిమ్మల్నీ కొట్టిస్తా అన్నారు. ఇంకా ఎన్ని గొడవలు చేస్తారో చేయండి.. సమయం వచ్చినప్పుడు చూపిస్తా అన్నారు. మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్న మీకు హెచ్చరిస్తున్నా.. చర్యకు ప్రతి చర్య మాత్రం తప్పకుండా ఉంటుందన్నారు. ఇలా దాడులు చేస్తుంటే భగవంతుడు, కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని క్షమించరన్నారు. చంద్రగిరికి వచ్చే ఏ అధికారైనా చట్ట బద్ధంగా న్యాయం పాటించక పోతే ఇక్కడ నుంచి తిరిగి బదిలీపై వెళ్లే లోపు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా.. న్యాయం, ధర్మం కోసం పనిచేయండి.. అధర్మానికి కొమ్ముకాయవద్దు అన్నారు. ఎవరి మెప్పు కోసమో అధర్మంగా పని చేయడానికి చంద్రగిరికి వచ్చే అధికారులను మాత్రం వదిలిపెట్టనన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చారు.. వారికి అవకాశం ఇద్ధామనుకున్నా.. బయటకు వెళ్లి వ్యాపారం చేసుకుందామనుకున్నా.. కానీ నన్ను నమ్మిన పార్టీ క్యాడర్ ను ప్రతి రోజు కొడుతుంటే ఎలా వెళ్లగలను అన్నారు. అందుకే ఇకపై పూర్తి సమయం క్యాడర్ తోనే ఉండాలని నిర్ణయించుకున్నా.. ప్రతిపక్షంలో నా పోరాటం ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను అన్నారు. ఒక్క వైసీపీ కార్యకర్తను కొట్టినా ఇకపై సహించేది లేదు.. ప్రజలు అవకాశం ఇచ్చారు.. చక్కగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకోండి అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చంద్రగిరి నుంచే మొదటగా పోరాటం మొదలుపెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆ పరిస్థితి తెచ్చుకోవద్ధు అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :