- గిరిజన హక్కులు,చట్టాలు అమలు చేయడంలో విఫలం
- కరపత్రలు పంపిణీ చేస్తున్న ఆదివాసి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కిల్లో రామకృష్ణ
అల్లూరి జిల్లా, అరకువేలి,ది రిపోర్టర్ న్యూస్ : అరకు నియోజకవర్గం
అనంతగిరి మండల ఏపీ ఆదివాసి కాంగ్రెస్ చైర్ పర్సన్ పాచిపెంట శాంత కుమారి ఆదేశాల మేరకు అనంతగిరి మండలము దమ్ముకు సంత వద్ద. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలన నిత్యవసర సరుకులు ధరలు భారీగా పెరిగిపోయింది నిరుద్యోగం బాగా పెరిగింది ఆర్థిక సంక్షోభంలో గిరిజనులు ఇబ్బంది పడుతున్నామని బిజెపి పార్టీ, వైసిపి పార్టీ విధానాలను ఎండగడుతూ… రాష్ట్రం గిరిజనులకు అన్యాయం చేస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం. బోయా.బెంతు ఒరియా బీసీ.ఏ కులస్తులను గిరిజనుల జాబితాలో కలపడానికి తీర్మానం చేసింది.జి. ఓ. నెంబర్ 3 రద్దు ఐ నాలుగు సంవత్సరాలు గడుస్తున్న. సుప్రీంకోర్టులో రివిపిటిషన్ దాఖలు చేయకుండా వైసిపి రాష్ట్ర ప్రభుత్వము గిరిజనులకు అన్యాయం చేస్తుంది ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లులను రెవెన్యూ వాల్ చేయకపోవడం. వలన రాష్ట్రంలో సుమారు 130 మంది విద్యార్థిని విద్యార్థులు మరణించడం చాలా దురదృష్టకరము. వైసీపీ పార్టీ వైసిపి ప్రజాప్రతినిధులు నాయకులు గిరిజన హక్కులు చట్టాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. వైసిపి పార్టీ ప్రజాప్రతినిధులు దీనిపైన నోరు మెదపకుండా ఉండడం ఎంతవరకు సమంజసమని గిరిజనులు మేలుకోవాలని శాంతకుమారి. గిరిజన హక్కులు చట్టాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన సుమారు 25 సమస్యలతో ముద్రించిన కరపత్రాలను పంచుతూ యువతీ యువకులకు వైసీపీ పార్టీ వలన గిరిజనులు చాలా మోసపోతున్నాము అన్యాయానికి గురి అవుచున్నాము ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మేల్కోవాలని. రాబోయే రోజుల్లో వైసిపి పార్టీకి ఓటు వేస్తే గిరిజనులు అధోగతి పాలవుతామని ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 1/70 చట్టానికి వైసిపి నాయకులు వెన్నుపోటు పొడుస్తూ వ్యతిరేకంగా అనంతగిరి మండలంలో భారీ అక్రమ కట్టడాలు బినామీలు చేపడుతున్నప్పటికీ. ప్రభుత్వ అధికారులు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ఎటువంటి చర్య తీసుకోకుండా గిరిజన హక్కులు చట్టాన్ని భంగం కలిగిస్తున్నారని. గిరిజనుల హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని గిరిజనులకు పిలుపునిచ్చారు.