- అందాల అరకులో వైసీపీ తిరుగుబాహుటా ?
- ఇన్చార్జిలా నియామకంతో పెల్లుబుగుతున్న ఆందోళనలు ?
- తెరపైకి తీసుకువచ్చిన లోకల్ ,నాన్ లోకల్ ?
- మీ స్వార్థం కోసం రాజకీయ మా? ఆదివాసీల తలరాతలు మార్చడానికా??
అల్లూరి జిల్లా, అరకు : ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసిపి పార్టీ అధినేత అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేక దృష్టి పెడుతూ ముందుగా ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగుతున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెండవ జాబితాలో 20 మంది ఇన్చార్జిలను నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఇన్చార్జిలా పేర్లను వెల్లడించింది. దీంతో అందాల అరకులోయలో వైసీపీ నేతలు తిరుగుబా హుటా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. అరకులోయ నియోజకవర్గ ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉన్న ప్రజలు అనేకమంది నేతలు వైసిపి ద్వారా టిక్కెట్ ను పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అరకు నియోజకవర్గంలోని 6 మండలాల్లో అత్యధికంగా కొండదొర సామాజిక వర్గం ఉండగా రెండో స్థానంలో వాల్మీకి సామాజిక వర్గం ఉంది. ఎమ్మెల్యే వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఆ సామాజిక వర్గానికి చెందిన వారే అనేక పదవులు చేపట్టడం వారికే ప్రత్యేకత ఇస్తుండడంతోపాటు మిగిలిన సామాజిక వర్గ నేతలను పట్టించుకోవడంలేదని ఈ నియోజకవర్గంలో పాల్గుణ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పలువురు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
అయితే అదే సామాజిక వర్గానికి చెందిన అనేకమంది ఈసారి ఎలా అయినా అరకు టికెట్ సంపాదించి ఎమ్మెల్యే పదవి చేపట్టాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే తరహాలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు సైతం 2024 ఎన్నికల్లో బరిలో దిగేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే కొంతమంది నేతలు ఆయా నియోజకవర్గాల్లో కలియ తిరుగుతూ ప్రజా ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే అరకు పార్లమెంటుకు ఇన్చార్జిగా పాడేరు ప్రస్తుత ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని, అరకు నియోజకవర్గానికి ప్రస్తుత ఎంపీ మాధవిని ఇన్చార్జిలుగా నియమించారు.
దీంతో నియోజకవర్గంలోని వైసిపి నేతలు బగ్గుమంటున్నారు. నియోజకవర్గంలో ఇంతమంది నేతలు ఉన్నప్పటికీ పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఇన్చార్జిగా ఎలా నియమిస్తారని.ఈమె భర్త గిరిజనేతడు కావడంతో ఈమె గిరిజనేతరాలు అవుతుందని అటువంటి వ్యక్తిని గిరిజన ప్రాంతంలో పగ్గాలు ఎలా అప్పగిస్తారని. అనేకమంది అనుభవం కల లోకల్ నేతలు ఉండగా నాన్ లోకల్ నుండి తీసుకువచ్చి ఇక్కడ బాధ్యతలు అప్పగించడమేంటంటూ ఈ నియోజకవర్గంలోని వైసిపి టికెట్ను ఆశించిన సుమారు తొమ్మిది మంది నేతలు, అభిమానులు సీనియర్ కార్యకర్తలు, నాయకులు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు.
ఇప్పటికే పలు మండలాల్లో నాన్ లోకల్ వద్దు అంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇదే అంశంపై అరకులో ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశమైనట్లు కూడా తెలుస్తుంది.
వీరంతా కలిసికట్టుగా ఉండి రానున్న ఎన్నికల్లో వైసిపి తీరు మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసినీయంగా తెలిసింది. ఇదే కాకుండా అరకు ప్రాంతంలో బుధవారం వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి జగన్ ముద్దు మాధవి వద్దు, లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దే వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనలు చేశారు.
మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న అరకు నియోజకవర్గం ఇన్చార్జిల నియామకంతో ఒక్కసారి బగ్గుమంది. ఈ ఆందోళనలు ఈ తిరుగుబాటు తనం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా మారుతుందో, వీరంతా అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి సహకరిస్తారా లేక ఓటమి పడవను ఎక్కిస్తారా అన్నది అంతు చిక్కడం లేదు.
ఒకపక్క పర్యాటకులతో కిటకిటలాడుతున్న అందాల అరకులోయ వస్తాం వైసిపి శ్రేణుల నిరసనలతో హోరెత్తుతుంది. ఈ పరిస్థితి ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. అరకు అసెంబ్లీ స్థానాల్లో గ మాధవి నీ బరిలోకి దింపితే అరకులోయ నియోజకవర్గం ఓటమి పాలు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.