- కోర్టు ధిక్కరణ కు పాల్పడుతున్న వైసిపి.
- పనులు అడ్డుకున్న గిరిజనులు
అల్లూరి జిల్లా పాడేరు: వైసిపి పార్టీ ఆఫిస్ నిర్మాణానికి స్థలం కేటాయింపు పై కోర్టు స్టే ఇచ్చిన నిర్మాణ పనులు చేయడం కోర్టు ధిక్కరణ కింద వస్తుందని, హై కోర్టు స్టే ను అమలు చేయాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పల నర్శ డిమాండ్ చేశారు.
పాడేరు మండలం లో వైసిపి పార్టీ ఆఫిస్ నిర్మాణానికి స్థలం కేటాయించిన భూమిలో హై కోర్టు స్టే విధించి పనులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పల నర్శ పర్యటన చేశారు. కోర్టు ధిక్కరించి నిర్మాణ పనులు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన భూ బాధిత కుటుంబాలు పనులు అడ్డుకున్నారు. అనంతరం పి. అప్పల నర్శ మాట్లాడుతూ… 1/70 చట్టని దిక్కారించి వైసిపి పార్టీ ఆఫిస్ నిర్మాణానికి స్థలం కేటాయింపు చేయడం అన్యాయం అన్నారు. హైకోర్టు స్టే విధించిన వైసిపి పార్టీ ఆఫిస్ నిర్మాణానికి స్థలం లో పనులు నిలుపుదల లేదు. పైన భూ బాధిత కుటుంబాలు పనులు జరిగే చోట వెళ్లి పనులు నిలుపుదల చేయాలని కోరితే మీ దిక్కు ఉన్న చోట చెప్పుకోమని చెప్పడం సరికాద్నారు. రాజ్యాంగం పై, న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉంటే తక్షణమే వైసిపి పార్టీ ఆఫిస్ నిర్మాణానికి కేటాయించి స్థలం లో పనులు నిలుపుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుందరా రావు, మండల అధ్యక్షుడు ఎస్.చిట్టి బాబు, సతీ బాబు, కొండలరావు మరియు భూ బాధిత కుటుంబాలు పాల్గొన్నారు.