వైయస్సార్ తెలంగాణ పార్టీ మానకొండుర్ నియోజక వర్గం ఇంఛార్జి సంపతి ఉదయ్ కుమార్
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : షర్మిల పాదయాత్ర అంటే కెసిఆర్ కు వణుకు పుడుతోంది అని వైయస్సార్ తెలంగాణ పార్టీ మానకొండుర్ నియోజక వర్గ ఇంఛార్జి సంపతి ఉదయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఉదయ్ కుమార్ మాట్లాడుతూ పాదయాత్ర కూ హైకోర్టు అనుమతి ఉన్న పాద యాత్ర అపడం పట్ల వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళుతుండగా అక్రమంగా అరెస్ట్ చేయడం శోచనీయం. పాద యాత్ర కోసం షర్మిల నిరసన కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో షర్మిల తెలంగాణ లో ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన షర్మిల కు ప్రజల నుండి వస్తున్న అదరను అపలెరన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం తో షర్మిల పై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడు తుందని అన్నారు. పాద యాత్ర కొనసాగే వరకు ఊరుకో బోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో కుమ్మరి రమేష్, నౌండ్ల కృష్ణ, నర్సయ్య, సంపతి మహేందర్ , భుమేష్ తదితరులు పాల్గొన్నారు.