ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మండలంలోని అన్ని గ్రామాలలో పంటపొలాలు నష్టపోయిన రైతులు బాధపడుతుంటే అటువంటి సందర్భంలో పంట పొలాలను బిజెపి మండల అధ్యక్షులు దోనె అశోక్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది మండలంలోని అన్ని గ్రామాల్లో వరి పంటలు నేల కోరడం జరిగింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వస్తున్న తరుణంలో ప్రకృతి వైపరీత్యానికి గురై రైతన్నకు పంట చెల్లు నిరాశను కలిగించాయి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను గుర్తించి వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఇదే సంవత్సరంలో పంట నాటు వేసే తరుణంలో ప్రకృతి ప్రకృతి వైపరీత్యానికి నారు కొట్టుకుపోవడం జరిగింది మరియు ప్రకృతి రైతుకు పట్టినట్టుగా సమయానికి రాగానే గాలివాన లకు వరి చేను నెలకొనడంతో రైతుకు కన్నీరే మిగిలింది అంతే కాకుండా ఖరీఫ్ సీజన్కు ముందు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సన్నరకం వడ్లు పెట్టాలి దొడ్డు రకం వడ్లు పండించినట్లు అయితే ప్రభుత్వం కొనుగోలు చేయదు అని రైతులకు భయబ్రాంతులకు గురి చేయడం వలన రైతులంతా కూడా ప్రభుత్వం సూచించిన RNR సన్నపు వడ్లను పండించగా దోమ కాటుకు గురై దిగుబడి తగ్గి రైతుకు నిరాశ మిగిలింది నష్టపరిహారాన్ని కంపెనీ భరిస్తుందా లేదా ప్రభుత్వం భరిస్తుందా తేల్చుకుని రైతులకు న్యాయం చేయాలి లేనిచో రానున్న రోజుల్లో లో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో దొంతర వేని శ్రీనివాస్ ,సంఘ రవి, ముస్కే మహేందర్, వడ్లూరి సాయిలు, బొ ప్పెన అజయ్, గంప రవి కుమార్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు