తమిళ స్టార్ అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో నటిస్తున “వాలిమై” మూవీ నుంచి మేకర్స్ తాజా ఒక అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమాలో తెలుగు నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి హుమా ఖురేషి కథానాయిక నటిస్తుంది.ఈ చిత్రం ఫిబ్రవరి 24 న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తమిళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కావడం ఖాయమైంది. తెలుగు, హిందీ ట్రైలర్‌లను త్వరలో విడుదల చేయాలని సినిమా నిర్మాతలు భావిస్తున్నారు.