కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కాకతీయ కెనాల్ వద్ద సుల్తానాబాద్ కి చెందిన మాచర్ల శ్రీనివాస్ స్వరూప దంపతులు చాపలు కొనుగోలు చేసి తమ యొక్క కారు రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి కాకతీయ కెనాల్ లో పడి ఇద్దరు దంపతులు మృతి చెందారు, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కారును మృతదేహాలను వెలికి తీశారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపీ విజయసారథి, తిమ్మాపూర్ సిఐ మహేష్ గౌడ్, ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం 108 లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.