కనురెప్ప పాటు నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలి అయ్యేది.కరీంనగర్ జిల్లా అలుగునూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది వరంగల్ వైపు నుండి వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ అలుగునూర్ చౌరస్తా వద్ద రోడ్డు క్రాస్ చేసేందుకు ఆగి ఉండగా…. వెనుక నుండి వచ్చిన హార్వెస్టర్ ముందు ఉన్న ఎక్సెల్ గమనించలేక… ముందుకు కదలడంతో… ఎక్సెల్ బైక్ పై ఉన్న వ్యక్తి హార్వెస్టర్ కింద ఇరుక్కుపోయాడు. దీంతో గమనించిన స్థానికులు ఒక్క సారిగా పెద్ద కేకలు వేయడంతో అప్రమత్తమైన హార్వెస్టర్ డ్రైవర్ వెంటనే వాహనం ఆపడంతో ఓ నిండు ప్రాణం దక్కి పెద్ద ప్రమాదం తప్పింది. అందులో చిక్కుకున్న వ్యక్తిని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. గాయాలైన వ్యక్తి మానకొండూరు మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన మార్క లక్ష్మణ్ గా గుర్తించారు. దాదాపు పదిహేను నిమిషాలపాటు వాహనం చౌరస్తా వద్ద ఉంచడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మొత్తానికి స్థానికులు సహాయం తో ఓ నిండు ప్రాణం దక్కింది.