ఇండియన్ నేవీ.. పర్మనెంట్ కమిషన్ (పీసీ) 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobsదీనిద్వారా ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్‌లో ఖాళీలను భర్తీ చేయడానికి జేఈఈ మెయిన్ రాసిన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన అభ్యర్థులు.. వివిధ విభాగాల్లో ఉచిత ఇంజనీరింగ్ విద్యతోపాటు ప్రముఖ యూనివర్సిటీ జేఎన్‌యూ నుంచి పట్టాను పొందే అవకాశం ఉంటుంది. ఉన్నతమైన హోదా, ఆకర్షణీయమైన వేతనాలు, అదనపు ప్రయోజనాలు, సుస్థిర జీవితాన్ని ఈ ఉద్యోగాలతో సొంతం చేసుకోవచ్చు.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 26 (ఎడ్యుకేషన్ బ్రాంచ్-05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్-21).
విద్యార్హతలు:
ఫిజక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. అలాగే 10వ తరగతి లేదా 12వ తరగతి స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. దీంతోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2020 (బీఈ/ బీటెక్)లో అర్హత సాధించిన వారై ఉండాలి.
వయసు
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 02 జనవరి 2002 నుంచి 01 జూలై 2004 మధ్య జన్మించినవారై ఉండాలి. వయసు 17 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎత్తు కనీసం 157 సెంటీ మీటర్లు ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ
జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. వీరికి బెంగళూర్/భోపాల్/కోల్కత్తా/ విశాఖపట్నంలలో మార్చి నుంచి జూన్ మధ్య ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జనవరి 29, 2021.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.joinindiannavy.gov.in