గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన దాదాపు 20 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కోసం ఉక్రెయిన్లో వున్నారు. గత కొంత కాలంగా ఉక్రెయిన్లో విద్యను అభ్యసిస్తూ జీవనం గడుపుతున్నారు.
విజయవాడలోని ఓ కన్సల్టెన్సీ చెప్పిన మాటలు నమ్మి ఇటలీ వెళ్లాల్సిన విద్యార్థులకు వీసాలు రాకపోవడంతో వారిని పక్కదారి పట్టించి ఉక్రెయిన్ కు పంపారు. ఇంజనీరింగ్ విద్యకు ఎలాంటి ఫీజులు ఇటలీలో లేకపోవడంతో అక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయని గతంలో వెళ్లిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ఇటలీ బాట పట్టారు.
అయితే ఇటలీ కోవిడ్ నేపథ్యంలో ఆ దేశ ఎంబసీ వీసాలను నిరాకరించింది. ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో విడతలవారీగా విజయవాడ ప్రైవేట్ కన్సల్టెన్సీ లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. తిరిగి ఆ నగదు చెల్లించాలని వారిపై ఒత్తిడి పెరగడంతో ఉక్రెయిన్ కు విద్యార్థులను కొంతమందిని విద్యాభ్యాసం కోసం పంపారు. ఇందులో భాగంగానే వినుకొండ ప్రాంతానికి చెందిన దాదాపు 20 మంది విద్యార్థులు ఉక్రెయిన్ లో ఇంజనీరింగ్ చేరారు. అయితే అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని వెళ్లిన విద్యార్థులు జీవన విధానం సరిగాలేదని యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ముందస్తుగా ఇరవై రోజుల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చారు. కొద్ది గంటల గా ఉక్రెయిన్ రష్యా దళాలు భీకర బాంబుల దాడులు బిక్కుబిక్కుమంటున్న ప్రజలు అరచేతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్న ప్రజల దుర్భర స్థితి చూసి ప్రపంచమే కలవరపడుతున్నా పరిస్థితి తెలిసిందే.. తెలుగు విద్యార్థులు, భారతీయ విద్యార్థులు అనేక మంది అక్కడ ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు విద్యార్థులను తిరిగి ఇండియాకు రప్పించేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఈ ఉక్రెయిన్ లో ఉన్న అలజడి పరిస్థితులను టీవీలలో వీక్షిస్తున్న ప్రజలు ముఖ్యంగా ఉక్రెయిన్ నుండి బయటపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకొని హామ్మయ్య అనుకొని.. ఆనందంగా ఉండడం వారి మోములో కనిపిస్తుంది.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన ప్రముఖ సినీ నిర్మాత నందమూరి యువసేన నేత లగడపాటి శ్రీనివాసరావు కుమారుడు భార్గవ్ ఇంజనీరింగ్ చదువు కోసం ఉక్రెయిన్ వెళ్లి ఇరవై రోజుల క్రితం తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా లగడపాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ నేడు ఉక్రెయిన్ లో జరుగుతున్న భీకర పోరు చూస్తుంటే మా పిల్లలు తిరిగి మా వద్దకు రావడం ఆ భగవంతుని కృప అని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు..
తన కుమారుడితో పాటు ఉక్రెయిన్ వెళ్లిన తెలుగు విద్యార్థులు 20 మంది వచ్చినట్లు శ్రీనివాసరావు వివరించారు..