కరీంనగర్ జిల్లా: బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు పోతుగంటి సుజాత రెడ్డి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ లోని నారి లక్ష్య సాధన ఫౌండేషన్ వారు 2020 సంవత్సరానికి డైనమిక్ లేడీ లెజండ్ అవార్డ్ ను మార్చి 1వ తేదీ ఆదివారం నాడు హోటల్ ప్లాజా బేగంపేట హైదరాబాద్ నందు ముఖ్య అతిధిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకొనున్నారు అమ్ము స్వచ్ఛంద సంస్థ ద్వారా సంఘసేవ మరియు అభాగ్య మహిళలకు అందిస్తున్న చేయూత అనాధ వృద్దులకు విద్యార్థులకు చేస్తున్న ఆర్థిక సహాయం మహిళలకు ఉచిత వృత్తి విద్యా కార్యక్రమములు చేపడుతున్నందుకు పోతుగంటి సుజాత రెడ్డి ని ఈ అవార్డ్ కు ఎంపిక చేసినట్లు నారి లక్ష్య సాధన ఫౌండేషన్ నిర్వహకురాలు శ్రీమతి మాధవి ఒక ప్రకటనలో తెలియజేశారు.